గురువారం 06 ఆగస్టు 2020
Devotional - Jul 12, 2020 , 19:06:56

సుందరకాండ పారాయణానికి అపూర్వ స్పందన

 సుందరకాండ పారాయణానికి అపూర్వ స్పందన

తిరుమల : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారాలను సుమారు కోటి మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తులు తిలకిస్తున్నారని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని పరిపాలనా భవనంలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సలహాలు, సూచనలను తీసుకున్నారు. 

సుందరకాండ పారాయణం, వేదపారాయణం కార్యక్రమంపై ఎక్కువ మంది భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేసి నిర్వహకులకు ధన్య‌వాదాలు తెలిపారు. భక్తుల కోరిక మేరకు త్వరలో సాయంత్రం కూడా మరో కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో ప్రకటించారు. ఛాన‌ల్‌లో  వ్యాపార ప్ర‌క‌ట‌న‌లను తొల‌గించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం..ఎస్వీబీసీ ట్రస్టుకు భక్తుల నుంచి విరాళాలు ఆహ్వానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరకామణి సేవకు ఎక్కువ మంది సిబ్బంది అవసరం లేదని ఈవో వెల్లడించారు. 

కాగా శనివారం 10,047 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 2650 మంది తలనీలాలు సమర్పించుకోగా వివిధ కానుకల ద్వారా    హుండీ ద్వారా రూ. 54లక్షలు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.


logo