శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Mar 24, 2020 , 14:36:15

ఉగాది రోజు ఏ స‌మ‌యంలో ఏం చేయాలి ?

ఉగాది రోజు ఏ స‌మ‌యంలో ఏం చేయాలి ?

ఉగాది అంటే తెలుగువారికి కొత్త సంవ‌త్స‌రం. ఈ పండుగ‌నాడు ఏయే ప‌నులు చేస్తామో దాన్నిబ‌ట్టి ఆ ఏడాది అధార‌ప‌డి ఉంటుంద‌ని ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తారు. అందుకే ఉగాది నాడు ఏ స‌మ‌యాల్లో ఏం చేయాలో పండితుల పేర్కొన్న విష‌యాలు తెలుసుకుందాం... ఉద‌యం సూర్యోద‌యానికి ముందే అభ్యంగ‌న స్నానం, త‌ర్వాత ప‌చ్చ‌డి సేవ‌నం చేయాలి.  ఉదయం 6 నుంచి 11.00 మధ్య కొత్త వస్తువులు, పసుపు, బంగారం, బెల్లం మొదలైనవి కొనుగోలు చేయడానికి శుభ సమయం. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారులు ఈ రోజునే కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభిస్తారు. కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించడానికి ఉదయం 7 గంటల నుంచి 10.45 మధ్య మంచి ముహూర్తం. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు ముహూర్తం బాగుందని పండితులు పేర్కొంటున్నారు. 

రైతుల‌కు ప్ర‌త్యేక స‌మ‌యం: ఉగాది రోజునే రైతులు తొలి యేరు పూసి ఖరీఫ్‌కు సిద్ధమవుతున్నారు. ఉగాది రోజు ఉదయం 4.30 నుంచి 6.00 గంటలలోగా తొలియేరు, మారు యేరు, బండి పూయడం చేయాలి. అలాగే, ప్రయాణాలు ఉదయం 6.00 గంటల నుంచి 11.00 గంటలోగా, తిరిగి మధ్యాహ్నం 1.30 నుంచి 4.30 గంటలకు మంచిది. పడమర దిశకు ప్రయాణాలు అత్యంత శుభదాయకం. ఉత్తర ప్రయాణం పనికిరాదని పండితులు వెల్లడిస్తున్నారు. ఈ స‌మ‌యాల‌ను పాటస్తే శుభ‌క‌ర‌మ‌ని పండితులు చెప్తున్నారు. 


logo