శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - Mar 24, 2020 , 14:36:52

ఉగాది ప‌చ్చ‌డి ఏ స‌మ‌యంలో తీసుకోవాలి ?

ఉగాది ప‌చ్చ‌డి ఏ స‌మ‌యంలో తీసుకోవాలి ?

ఉగాది... తెలుగు సంవ‌త్స‌రాది. ఈ పండుగ రోజు ఏం చేయాలి? ఏ స‌మ‌యాల్లో ఏ స‌మ‌యాల్లో ప‌చ్చ‌డిని స్వీక‌రిస్తే మంచిది అనే విశేషాల‌ను తెలుసుకుందాం... తెల్ల‌వారు జామున లేచి కాల‌కృత్యాలు పూర్తిచేసుకోవాలి. త‌ర్వాత దేవుని పూజ‌, ఉగాది ప‌చ్చ‌డి చేసి దేవుడికి నైవేద్యంగా స‌మ‌ర్పించి త‌ర్వాత నింభ‌ఫ‌ల భ‌క్ష‌ణం చేయాలి. అంటే ఉగాది ప‌చ్చ‌డి సేవ‌నం చేయాలి.  ఉదయం 6.00 గంటల నుంచి 11.00 మధ్యన ఉగాది ప‌చ్చ‌డి తీసుకుంటే మంచిది అని పండితులు పేర్కోంటున్నారు. ఇది అత్యంత అనుకూలమైన సమయమని తెలిపారు. 

 ఏ మంత్రం చ‌ద‌వాలో తెలుసా ?

నింబ‌ఫ‌ల భ‌క్ష‌ణం స‌మ‌యంలో కింది శ్లోకాన్ని ప‌ఠించాలి...

‘శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ, 

సర్వారిష్ట వినాశాయనింకం దళభ‌క్షణం’ ’ 

అనే ఈ శ్లోకాన్ని ప్రత్యేకంగా చదివి పచ్చడి తీసుకోవాలి. 

అర్థం: వందేళ్లపాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవడం దీని అర్థం.

ఉగాది ప‌చ్చ‌డిలో వాడాల్సిన ప‌దార్థాలు: వేపపూత, మామిడికాయ ముక్కలు, బెల్లం, ఉప్పు, మిరియాలు/కారం,  చింతపండు.

ఈ ప‌దార్థాలు ష‌డ్రుచుల‌కు సంకేతాలు. తీపి, చేదు, వ‌గ‌రు, కారం, ఉప్పు, పులుపు. అంతేకాదు వీటిలో బెల్లం సంతోషానికి, వేపపూత విచారానికి, కారం కోపానికి, ఉప్పు భయానికి, చింతపండు అసహ్యానికి, మామిడి ఆశ్చర్యానికి సంకేతాలుగా పెద్దలు చెప్తారు. logo