మంగళవారం 04 ఆగస్టు 2020
Devotional - Jun 20, 2020 , 07:15:24

రేపు సూర్యగ్రహణం ..శ్రీవారి దర్శనాలు రద్దు

రేపు సూర్యగ్రహణం ..శ్రీవారి దర్శనాలు రద్దు

హైదరాబాద్‌: సూర్యగ్రహణం కారణంగా తిరుమలలోని  శ్రీవారి ఆలయం ఆదివారం మూసివేయనున్నారు. శనివారం రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ అనంతరం శ్రీవారి ఆలయ తలుపులు మూసి వేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ఆదివారం ఉదయం 10.18 నుంచి మధ్యాహ్నం 1.38 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం గ్రహణం వీడిన తర్వాత 2.30 గంటలకు ఆలయాన్ని తెరుస్తామని వారు వెల్లడించారు. మ‌ధ్యాహ్నం నుంచి  రాత్రి వరకు సుప్ర‌భాతం, శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, తోమాల సేవ, కొలువు, ఏకాంతసేవ నిర్వ‌హిస్తామన్నారు.

ఈ కైంక‌ర్యాల కార‌ణంగా జూన్ 21న పూర్తిగా శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఉండ‌దని వివరించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.


logo