మంగళవారం 27 అక్టోబర్ 2020
Devotional - Oct 05, 2020 , 16:27:18

దర్శనం టికెట్ల అదనపు కోటా విడుదల చేసిన టీటీడీ

దర్శనం టికెట్ల అదనపు కోటా విడుదల చేసిన టీటీడీ

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం మరింత మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి ప్రేరేపిత లాక్‌డౌన్‌తో మార్చిలో ఆలయంలో భక్తులకు ప్రవేశం నిలిపివేశారు. అన్‌లాక్‌లో భాగంగా పలు సడలింపులో ఆలయాలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు స్వామి వారి దర్శనం కల్పిస్తోంది. తాజాగా సోమవారం నుంచి భక్తులకు మరింత మంది శ్రీవారిని దర్శించుకునేలా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటాను టీటీడీ విడుదల చేసింది. సోమవారం నుంచి 14వ తేదీ వరకు, 25వ తేదీ నుంచి 31 వరకు అదనంగా రెండు స్లాట్లల్లో మూడువేల మంది దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. రాత్రి 9, 10 గంటల స్లాట్లు కేటాయించింది. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 15 నుంచి 24 మధ్య దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయలేదు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo