సోమవారం 10 ఆగస్టు 2020
Devotional - Jun 25, 2020 , 10:35:21

టీటీడీకి రూ.62 లక్షల హుండీ ఆదాయం

టీటీడీకి రూ.62 లక్షల హుండీ ఆదాయం

తిరుమల: తిరుమల, తిరుపతి దేవస్థానం ఆలయానికి బుధవారం ఒక్కరోజే సుమారు రూ. 62 లక్షల హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 9059మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించారు. ఈరోజు  6వేల మంది భక్తులకు ప్రత్యేకదర్శనం ద్వారా దర్శన అవకాశం కలుగనుందని పేర్కొన్నారు.

3750 ఉచిత టైమ్‌స్లాట్‌ టోకెన్లు జారీచేసినట్లు తెలిపారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భక్తులు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆలయానికి రావాలని సూచించారు. ప్రతి రోజూ 10వేల మంది భక్తులకు మాత్రమే దర్శన అవకాశముందని తెలిపారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఆలయంలో ప్రవేశం ఉంటుందని టీటీడీ అధికారులు వివరించారు. 


logo