బుధవారం 03 జూన్ 2020
Devotional - May 08, 2020 , 09:23:29

వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా టీటీడీ ఫైనాన్స్ క‌మిటీ స‌మావేశం

వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా టీటీడీ ఫైనాన్స్ క‌మిటీ స‌మావేశం

తిరుమ‌ల:‌ క‌రోనా ఎఫెక్ట్‌తో తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం 50రోజులుగా నిలిచిపోయింది. ఈ క్ర‌మంలోనే టీటీడీకి భారీగా ఆదాయం త‌గ్గిపోయింది. తిరుమలకు భక్తుల రాకను నిలిపివేసిన తరువాత, ఆదాయం తగ్గిపోగా, ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులకు సైతం నిధులను సర్దుబాటు చేయలేని స్థితిలో టీటీడీ ఉంది. ఈ నేపథ్యంలోనే సబ్ కమిటీల్లో ఒకటైన ఫైనాన్స్ కమిటీ సమావేశమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో తొలిసారిగా ఫైనాన్స్ కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. కాగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫైనాన్స్ కమిటీ మీటింగ్ విజయవంతం కావడంతో బోర్టు సమావేశం సైతం ఇదే విధానంలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.  శ్రీవారి దర్శనాల పునరుద్ధరణ విధి విధానాలు, ఆలయాన్ని తిరిగి తెరిస్తే, కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు స‌మాచారం. logo