శనివారం 30 మే 2020
Devotional - Apr 28, 2020 , 16:14:39

సోష‌ల్ మీడియా వ‌దంతుల‌ను ఖండించిన టీటీడీ

సోష‌ల్ మీడియా వ‌దంతుల‌ను ఖండించిన టీటీడీ

తిరుమ‌ల‌: తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నాల‌పై సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వ‌దంతుల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమ‌నే టీటీడీ పేర్కొంది.  తిరుమల శ్రీ వారి ఆలయంలో జూన్ 30 వతేదీ వ‌ర‌కు.. భక్తులకు దర్శనం నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో  ప్రచారం జరుగుతోంది. అయితే అదంతా అవాస్తమని టీటీడీ వెల్లడించింది. భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించే విషయంపై ధర్మకర్తల మండలి తగు నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఇలాంటి అవాస్తవ ప్రచారం చేస్తున్న వారి మీద టీటీడీ యాజమాన్య చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని టీటీడీ వెల్లడించింది.


logo