శనివారం 08 ఆగస్టు 2020
Devotional - Jul 10, 2020 , 06:51:29

నకిలీ వెబ్‌సైట్‌పై టీటీడీ ఫిర్యాదు

నకిలీ వెబ్‌సైట్‌పై టీటీడీ ఫిర్యాదు

తిరుపతి: శ్రీవారి దర్శనం టికెట్లు బుక్‌ చేస్తామని భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్‌పై టీటీడీ విజిలెన్స్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతిలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్న రఘు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్‌ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో ప్రయత్నించాడు. ఆన్‌లైన్‌లో rtddarrhanr అనే వెబ్‌సైట్‌ కనిపించడంతో దర్శన టికెట్లుకోసం వివరాలు సమర్పించి ఆసైట్‌కు నగదు బదిలీ చేశాడు.

నగదు బదిలీ ప్రక్రియ పూర్తయ్యాక  మెయిల్‌ ఐడీకీ దర్శన టికెట్లు పంపుతామని నమ్మించి పంపకపోవడంతో బాధితుడు టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇది నకిలీ వెబ్‌సౌట్‌గా గుర్తించిన విజిలెన్స్‌ అధికారులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo