మంగళవారం 04 ఆగస్టు 2020
Devotional - Jul 03, 2020 , 08:21:56

శాకాంబరి దేవిగా కనకదుర్గమ్మ దర్శనం

శాకాంబరి దేవిగా కనకదుర్గమ్మ దర్శనం

అమరావతి:  అమరావతిలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ భక్తులకు శాకాంబరి దేవిగా  దర్శనమిచ్చింది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న శాకంబరి ఉత్సవాలు మల్లిఖార్జున మండపంలో  ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉత్సవాలను ఆలయ ఈవో సురేశ్‌బాబు, వైదిక్‌ కమిటీ సభ్యులు ప్రారంభించారు.

తొలిరోజు  గుంటూరు మార్కెట్‌ యార్డు, ఆకు కూరల సంఘం, నూజివీడు రైతులు అలంకరణకు 4500 కిలోల కూరగాయలను, పండ్లను  ఆలయానికి అందజేశారు. సుమారు వందమంది మహిళలు  వాటిని దండలుగా కట్టడంతో రాజగోపుల ప్రాంగణం, దుర్గమ్మ ప్రధాన ఆలయం, ఉపాలయాల్లో వీటిని అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు గాను ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ పొందిన భక్తులకు మాత్రమే అనుమతించారు. 


logo