శుక్రవారం 07 ఆగస్టు 2020
Devotional - Mar 30, 2020 , 12:37:29

తిరుమ‌ల‌లో ఏకాంతంగా శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌లు

తిరుమ‌ల‌లో ఏకాంతంగా శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌లు

తిరుమ‌ల‌లో  శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌లు ఏకాంతంగా నిర్వ‌హించాని టీటీడీ నిర్ణ‌యించింది. ఏప్రిల్ 2వ తేదిన‌ శ్రీవారి ఆల‌యంలో శ్రీరామ న‌వ‌మి ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఏప్రిల్ 3న రాముల‌వారి ప‌ట్టాభీషేకం జ‌ర‌గ‌నుంది. ఏప్రిల్ 5నుంచి మూడు రోజుల పాటు నిర్వ‌హించే వార్షిక వసంతోత్స‌వాలను కూడా ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నది టీటీడీ. క‌రోనా ఎఫెక్ట్‌తో శ్రీవారి ఆల‌యాన్ని మూసివేసిన నేప‌థ్యంలో తిరుమ‌ల‌పై వ‌స్తున్న వ‌దంతుల‌ను ఖండించారు టీటీడీ అధికారులు. శ్రీవారి ఆల‌యంపై దుష్ర్ప‌చారం చేయ‌డం స‌రికాద‌న్నారు. శ్రీవారి ఆల‌యంలో ఆగ‌మ‌శాస్త్రం చెప్పిన‌ట్లుగానే పూజా కైంక‌ర్యాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. సుప్ర‌భాతం మొద‌లుకొని అన్ని సేవ‌లు స్వామివారికి జ‌రుగుతున్నాయని స్ప‌ష్టం చేశారు.


logo