గురువారం 06 ఆగస్టు 2020
Devotional - Jun 23, 2020 , 07:57:05

25 నుంచి శ్రీవారి ఆలయంలో సాక్షాత్కార వైభవం

25 నుంచి శ్రీవారి ఆలయంలో సాక్షాత్కార వైభవం

తిరుపతి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో  సాక్షాత్కార వైభవం నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ఆషాడ మాసంలో వచ్చే ఉత్తర ఫల్గుణి నక్షత్రం సందర్భంగా ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

                ఆల‌య ముఖ మండ‌పంలో ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాలను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదేశాల మేర‌కు క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా  ఏకాంతంగా స్నపనతిరుమంజనం జరుపుతామని వెల్లడించారు.

రాత్రి 7.00 గంట‌లకు స్వామివారిని మొదటిరోజు పెద్ద‌శేష వాహ‌నంపై, రెండో రోజు హనుమంత వాహనంపై, మూడో రోజు గరుడ వాహనంపై వేంచేపును నిర్వ‌హిస్తామన్నారు. జూన్ 28‌న పార్వేట ఉత్సవాన్ని జరుపుతామని  టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. logo