శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Mar 15, 2020 , 11:51:58

తెలంగాణలోని ఆలయాల సమాచారం....

తెలంగాణలోని ఆలయాల సమాచారం....

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయ సమాచారం...

*    ఉదయం 4 గంటల నుంచి 4:30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు సుప్రభాతం

*    ఉదయం 4:30 గంటలకు నుంచి 5 గంటలవరకు బాలభోగం

*    ఉదయం 5 గంటల నుంచి 7:15 గంటల వరకు సహస్రనామార్చన, ఆరాధన

*    ఉదయం 7:15 గంటల నుంచి మధ్యా హ్నం 12:00 గంటల వరకు ధర్మ, ఉభయ దర్శనాలు

*    మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు స్వామి అమ్మవార్లకు నివేదిన.

*    మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 4:00 గంటల వరకు ఆలయం మూసివేత

*    సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ధర్మ, ఉభయ దర్శనాలు 

*    రాత్రి 7:00 గంటల నుంచి రాత్రి 8:10 గంటల వరకు ఆరాధన, సహస్ర నామార్చనలు

*    8:15 గంటల నుంచి 9 గంటల వరకు ధర్మ, ఉభయ దర్శనాలు

*    రాత్రి 9 నుంచి 9:30 గంటల వరకు  పవళింపు సేవ, దర్శనాలు నిలిపివేత

*    రాత్రి 9:30 గంటల నుంచి 10గంటల వరకు ద్వార బంధనం, ఆలయ మూసివేత.

*    గదులు: కొండ కింద తులసీవనంలో  50 గదులు ఖాళీగా ఉన్నాయి.  

*    24 గంటల కాలవ్యవధితో ఒక గదిని కేటాయిస్తారు. రూ.250 నుంచి రూ.17:00 వరకు కిరాయ చెల్లించేవి ఖాళీగా ఉన్నాయి. 

*    వీఐపీల పర్యటనలు లేవు. 


వేములవాడ రాజన్న ఆలయ సమాచారం....

*    రాజన్న ఆలయంలో ఉదయం 3:45 నుంచి 4 గంటల వరకు మంగళవాయిద్యాలు.

*    ఉదయం 4 నుంచి 4:30 గంటల వరకు సుప్రభాతసేవ.

*    ఉదయం 4:30 నుంచి 5 గంటల వరకు స్వామివారి దర్శనం

*    ఉదయం 5 గంటల నుంచి 6:30 వరకు అర్చకులతో ప్రాతఃకాల పూజ,

*    ఉదయం 6:30నుంచి 11:30 వరకు భక్తులు స్వామివారికి గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించుకోవచ్చు

*    ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:15 నిమిషాల పాటు స్వామి వారికి అన్నపూజ, మహా నివేదన.

*    మధ్యాహ్నం 12:15 నుంచి 3 గంటల వరకు వరకు స్వామి వారికి భక్తులు అన్నపూజ చేసుకోవచ్చు.

*    3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు స్వామి వారిని దర్శించుకోవచ్చు.

*    సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు స్వామివారికి ప్రదోష పూజ, లఘు దర్శనం

*    రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 వరకు స్వామివారి దర్శనం. భక్తులు గర్భగుడిలో ఆకుల పూజలు నిర్వహించుకోవచ్చు.

*    రాత్రి 9 గంటల నుంచి రాత్రి 10 వరకు స్వామివారికి నిశిపూజ. స్వామివారికి లఘు దర్శనం .

*    రాత్రి 10 నుంచి 10:30 వరకు స్వామివారికి పవళింపుసేవ ఉంటుంది. అనంతరం ఆలయం మూసివేత.


బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ సమాచారం....

*  ఉదయం 4:00 గంటలకు దేవాలయం తెరుచుకుంటుంది

*  ఉదయం 4:00 గంటల నుంచి ఉదయం 4:30 గంటల వరకు అభిషేకం టికెట్లు ఇస్తారు.

*  ఉదయం 4:30 నుంచి శ్రీ అమ్మవారికి అభిషేకము, అలంకరణ, హారతి, తీర్థప్రసాదముల వితరణ ఉంటుంది.

*  7:30 గంటల నుంచి 12 గంటల వరకు సర్వదర్శనము, అక్షరాభ్యాసాలు, కుంకుమార్చనలు, ఇతర పూజలు చేస్తారు. 

*  మధ్యాహ్నం 12:00 గంటల నుంచి 12:30 గంటల వరకు నివేదన - హారతి ఉంటుంది.

*  1:00 గంటల నుంచి 2:00 గంటల వరకు ద్వార బంధనం

*  2:00 గంటల నుంచి 6:00 గంటల వరకు సర్వదర్శనాలు, అక్షరాభ్యాసం, ఇతర పూజలు ఉంటాయి.

*  సాయంత్రం 7:00 గంటల నుంచి 8:00 గంటల వరకు  అమ్మవారి ప్రదోష పూజ, మహా హారతి, తీర్థప్రసాద వినియోగము చేయబడును. 

*  రాత్రి 8:00 గంటల నుంచి 8:30 గంటల వరకు సర్వదర్శనం, అనంతరం ద్వార బంధనము ఉంటుంది.


భద్రాద్రి రామచంద్రస్వామి ఆలయ సమాచారం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయాన్ని ప్రతిరోజూ ఉదయం 4.30గంటలకు తెరుస్తారు. 

5.30 నుంచి 7గంటల వరకు బాలభోగం, నివేదన,సేవాకాలం.

ఉదయం 8.30గంటల నుంచి 9.30గంటల వరకు సహస్ర నామార్చన 

9.30 నుంచి 11.30వరకు నిత్య కల్యాణం. 

మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ద్వార బంధనం. 

అనంతరం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి దర్శనం. 

రాత్రి 7గంటల నుంచి 8గంటల వరకు దర్బారు సేవ, 

రాత్రి 9 గంటలకు ఆలయ ద్వార బంధనం.

తాజావార్తలు


logo