బుధవారం 30 సెప్టెంబర్ 2020
Devotional - Sep 15, 2020 , 22:47:29

అహం పోవాలంటూ కూరగాయలు అమ్మిన సుధామూర్తి

అహం పోవాలంటూ కూరగాయలు అమ్మిన సుధామూర్తి

చెన్నై : తమిళనాడులోని ప్రముఖ ఆలయం వద్ద కూర్చుని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా మూర్తి కూరగాయలు అమ్మారు. ఏడాదిలో ఒకరోజు ఇలా గుడి ముందు కూర్చొని కూరగాయలు అమ్మే పనిని గత కొన్నాళ్లుగా చేపడుతున్నారు. తనలోని అహాన్ని దూరం చేసుకోవడం ద్వారా స్వచ్ఛంగా మారేందుకు ఏడాదిలో ఒకరోజు కూరగాయల విక్రయం చేపడుతునానని సుధా మూర్తి చెప్తున్నారు. 

కూరగాయల కుప్పల మధ్య కూర్చొని ఉన్న సుధామూర్తి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమ ఇంటికి సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు కూర్చుని కూరగాయలు అమ్మడం చూసిన వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. కోట్లకు పడగలెత్తిన సుధామూర్తి ఇలా రోడ్డువారగా కూర్చుండి కాయగూరలు అమ్మడం ఏంటనే ప్రశ్న చాలా మందిలో నెలకొన్నది. ఇదే విషయాన్ని ఆమె వద్ద తీసుకురాగా.. తనలో ఉన్న అహంను పోగొట్టుకోవడానికి ఏడాదిలో ఒకరోజు ఇలా గుడి మెట్ల వద్ద కూరగాయలను శుభ్రం చేసి విక్రయిస్తానని స్పష్టం చేసింది. నారాయణమూర్తి తనతనంలో అమ్మమ్మతో కలిసి ఇలాంటి సేవలను చేసేవారని, ప్రతి సంవత్సరం ఈ కర్మను ఖచ్చితంగా అనుసరిస్తాను అని సుధామూర్తి చెప్పారు.

ప్రచారం కోసం కాకుండా దేవుని సేవ చేయడానికి తాను దీన్ని చేస్తానని ఆమె తెలిపింది. "ఇలాంటి సేవ చేయడం ద్వారా నాకు సంతృప్తి వస్తుంది. ఇది ధ్యానం చేయడానికి నాకు సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత స్థాయిలో నా హృదయానికి చాలా దగ్గరగా ఉండే ఒక కర్మ. నేను నిజంగా దేవుని సేవ చేస్తున్నానని భావిస్తాను. దేవుని ముందు అందరూ సమానమే. నేను నా పనిలో బిజీగా ఉండి ధ్యానం చేసుకుంటాను" అని సుధామూర్తి చెప్పారు.

అహం పోగొట్టుకునేందుకు కూరగాయలు విక్రయించే పనిని చేపట్టేందుకు వచ్చిన రోజున సుధామూర్తి.. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు దేవుడి సేవకు అంకితమవుతారు.


logo