శుక్రవారం 10 జూలై 2020
Devotional - Mar 24, 2020 , 07:19:42

నేడు తెలంగాణ ఆలయాల్లో హోమాలు

నేడు తెలంగాణ ఆలయాల్లో హోమాలు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నుంచి ప్రజలకు విముక్తి కలగాలని ప్రార్థిస్తూ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో పలు ఆలయా ల్లో హోమాలు నిర్వహిస్తున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం హో మం నిర్వహించారు. మంగళవారం కాళేశ్వరం దేవాలయం, బాసర జ్ఞానసరస్వతి దేవి ఆలయంలో, గద్వాల జిల్లా జోగులాంబ దేవాలయం, మెదక్‌ జిల్లా ఏడుపాయల దుర్గభావాని దేవాలయాల్లో మృత్యుంజయ హోమాలు నిర్వహిస్తారు.  శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం నాచారం గజ్వెల్‌, హైదరాబాద్‌ నగరంలోని చిక్కడపల్లిలో వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో సుదర్శన హోమం నిర్వహిస్తారు.  logo