గురువారం 13 ఆగస్టు 2020
Devotional - Jul 09, 2020 , 10:39:40

శ్రీవారి హుండీ ఆదాయం రూ.71లక్షలు

శ్రీవారి హుండీ ఆదాయం రూ.71లక్షలు

తిరుమల: తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల సందడి కొనసాగుతుంది. బుధవారం 10,109 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 3722 మంది తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

ఒక్కరోజే  హుండీ రూపేణా ఆలయానికి రూ.71లక్షలు ఆదాయం వచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ నెల 14నుంచి  శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కరోనా దృష్ట్యా భక్తులు తగు జాగ్రత్తలతో ఆలయానికి రావాలని సూచించారు. 

లోకల్టుగ్లోబల్.. వార్తఏదైనా.. అన్నీఒకేయాప్లో.నమస్తేతెలంగాణఆండ్రాయిడ్యాప్డౌన్లోడ్చేసుకోండి.


logo