ఆదివారం 09 ఆగస్టు 2020
Devotional - Jul 11, 2020 , 15:43:38

శ్రీవారి హుండీ ఆదాయం రూ.60లక్షలు

శ్రీవారి హుండీ ఆదాయం రూ.60లక్షలు

తిరుమల: తిరుమలలోని శ్రీవారిని శుక్రవారం 8,115  మంది భక్తులు దర్శించుకున్నారు. 2650 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు హుండీలో వేసిన కానుకల ద్వారా ఆలయానికి రూ.60లక్షల ఆదాయం వచ్చిందని తిరుమల, తిరుమతి ఆలయ దేవస్థానం అధికారులు తెలిపారు.

ఈనెల 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 16న ఆణివార ఆస్థానం , పుష్పపల్లకీని రద్దు చేసినట్లు వెల్లడించారు. ఆదివారం  ‘డయల్‌ ఈవో’ను యథావిధిగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.


logo