ఆదివారం 09 ఆగస్టు 2020
Devotional - Jul 29, 2020 , 08:45:06

శ్రీవారి హుండీ ఆదాయం రూ.42లక్షలు

శ్రీవారి హుండీ ఆదాయం రూ.42లక్షలు

తిరుమల: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని  మంగళవారం 5,491 మంది భక్తులు దర్శించుకున్నారు. 1,606 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ద్వారా ఆలయానికి రూ.42లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. గురువారం నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా బుధవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo