గురువారం 06 ఆగస్టు 2020
Devotional - Jul 25, 2020 , 12:25:50

శ్రీవారి హుండీ ఆదాయం రూ.40 లక్షలు

శ్రీవారి హుండీ ఆదాయం రూ.40 లక్షలు

తిరుమల: తిరుమల శ్రీవారిని శుక్రవారం  4,255 మంది భక్తులు దర్శించుకున్నారు. 1,471 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణా ఆలయానికి హుండీ ద్వారా రూ.40లక్షల ఆదాయం వచ్చిందని వివరించారు.

ఇది ఇలా ఉండగా పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి వెయ్యిడజన్ల గాజులను తిరుచానూరుకు చెందిన షణ్ముగం శుక్రవారం టీటీడీ జేఈవో పి.బసంత్‌కుమార్‌కు అందజేశారు.ఈనెల 31న శుక్రవారం వరలక్ష్మీవ్రతాన్ని వర్చువల్‌ సేవగా ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo