గురువారం 06 ఆగస్టు 2020
Devotional - Aug 01, 2020 , 07:37:35

శ్రీవారి హుండీ ఆదాయం రూ.35 లక్షలు

శ్రీవారి హుండీ ఆదాయం రూ.35 లక్షలు

తిరుమల: తిరుమలలోని స్వామివారిని శుక్రవారం  4,984 భక్తులు దర్శించుకున్నారు. 1540 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయానికి రూ.35లక్షల ఆదాయం వచ్చిందని వారు తెలిపారు. . శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగిందని వివరించారు. పవిత్రోత్సవాల మూడోరోజు శనివారం పూర్ణాహుతితో  ఉత్సవాలు ముగుస్తాయని టీటీడీ ఈవో అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo