శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jul 16, 2020 , 07:54:49

శ్రీవారి హుండీ ఆదాయం రూ.32లక్షలు

శ్రీవారి హుండీ ఆదాయం రూ.32లక్షలు

తిరుపతి: తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని బుధవారం 8068 మంది భక్తులు దర్శించుకున్నారు. 2760 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు హుండీలో సమర్పించిన కానుకల రూపేణ ఆలయానికి రూ.32లక్షల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

కరోనా వైరస్‌ ఉదృతి నేపధ్యంలో భక్తుల సందడి తగ్గిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 30 నుంచి ఆగస్టు 1వరకు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 


logo