మంగళవారం 20 అక్టోబర్ 2020
Devotional - Sep 26, 2020 , 11:13:50

సర్వభూపాల వాహ‌నంపై శ్రీ‌ మలయప్ప

సర్వభూపాల వాహ‌నంపై శ్రీ‌ మలయప్ప

తిరుమ‌ల‌: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శ‌నివారం ఉద‌యం 7 గంట‌లకు ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చారు. అర్చ‌కులు వైదిక కార్య‌క్ర‌మాల‌ను శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.  


సర్వభూపాల అంటే రాజుల‌కు రాజు అని అర్థం. ఈ ప్ర‌పంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భ‌క్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహ‌నాన్ని అధిష్టించారు. క‌రోనా నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాతంగా జ‌రుగుతున్న ఈ కార్య‌క్ర‌మం‌లో టీటీడీ చైర్మ‌న్  వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి, ఆల‌య సిబ్బంది పాల్గొన్నారు.


logo