Devotional
- Feb 22, 2021 , 07:08:37
VIDEOS
నేటి నుంచి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇవాళ ఉదయం 9 గంటలకు స్వస్తీవాచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా బ్రహ్మోత్సవాలను భక్తుల మధ్యే నిర్వహించనున్నారు.
కార్యక్రమాలు ఇలా..
- సోమవారం ఉదయం 9 గంటలకు స్వస్తీవాచనం, అనంతరం రక్షాబంధనం, పుణ్యహవాచనం, సాయంత్రం 5 గంటలకు అంకురార్పణం, మృత్సంగ్రహణం కార్యక్రమాలను వేదపండితులు నిర్వహిస్తారు.
- 23న ఉదయం 10గంటలకు ధ్వజారోహణం, వేదపారాయణాలు, సాయంత్రం 5గంటలకు భేరిపూజ, దేవతాహ్వానం
- 24న ఉదయం 6 గంటలకు హవనం, సింహవాహన అలంకార సేవ, సాయంత్రం 7గంటలకు ఎదుర్కోలు(అశ్వవాహనం)
- 25న ఉదయం 8 గంటలకు హవనం, తిరుమంజనోత్సవం, హనుమంత వాహనం, సాయంత్రం 7గంటలకు స్వామివారి కల్యాణోత్సవం (గజవాహనం)
- 26న ఉదయం 8గంటలకు గరుడవాహనం, సాయంత్రం 5గంటలకు రథాంగహోమం, 7 గంటలకు రథోత్సవం
- 27న ఉదయం 10గంటలకు పూర్ణాహుతి, మధ్యాహ్నం 12గంటలకు చక్రతీర్థ స్నానం, 7 గంటలకు పుష్పయాగం, డోలారోహణం
- 28న ఉదయం 9గంటలకు శతఘటాభిషేకం, ఒంటిగంటకు మహాదాశీర్వచనం, పండిత సన్మానంతో ఉత్సవాలకు పరిసమాప్తి
తాజావార్తలు
- బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ వెలిగిస్తే రూ. 1000 జరిమానా
- అమెరికా వైమానిక దాడిలో 17 మంది మిలిటెంట్లు మృతి
- దేశంలో కొత్తగా 16,577 కొవిడ్ కేసులు
- బన్నీ సినిమాను రిజెక్ట్ చేసిన ప్రియా ప్రకాశ్.. !
- 100 జిలటిన్ స్టిక్స్.. 350 డిటోనేటర్లు స్వాధీనం
- ప్రముఖ తెలుగు రచయిత్రి పెయ్యేటి దేవి ఇకలేరు
- మార్చి 4 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐదో దశ పరీక్షలు
- నేడు ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న ప్రధాని
- 60 వేల నాణెలతో అయోధ్య రామాలయం
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!
MOST READ
TRENDING