శనివారం 19 సెప్టెంబర్ 2020
Devotional - Aug 25, 2020 , 11:31:59

ఈ నెల 28 నుంచి గోవింద రాజస్వామి ఆలయంలో పవితోత్సవాలు

ఈ నెల 28 నుంచి గోవింద రాజస్వామి ఆలయంలో పవితోత్సవాలు

తిరుపతి : తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగ‌స్టు 28 నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. 27న సాయంత్రం రుత్విక్‌ వరణం, మృత్సంగ్రాహణం, పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో పవితోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 28న ఉదయం పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 29న మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించనున్నారు. 30న పుర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి. మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి సంక్రమణ క్రమంలో కొవిడ్‌ నిబంధనల మేరకు ఆలయంలో ఉత్సవాలను ఏకాంతంగానే నిర్వహించనున్నారు.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo