సోమవారం 10 ఆగస్టు 2020
Devotional - Jul 25, 2020 , 20:35:52

తిరుమలలో ఏకాంతంగా గరుడ సేవా

తిరుమలలో ఏకాంతంగా గరుడ సేవా

తిరుమల: కరోనా వైర‌స్‌ వ్యాప్తి నేపధ్యంలో గరుడ పంచమి వాహనసేవ వేడుకలను టీటీడీ అధికారులు ఏకాంతంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు రంగనాయకుల మండపంలో గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి  సేవలను ప్రత్యేక పూజలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు ,అధికారుల సమక్షంలో నిరాడంబరంగా జరిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, సీవీఎస్వో గోపినాథ్‌ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 

జిల్లాలో కరోనా పెరిగిపోతుండడంతో అధికారులు కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వస్తున్న భక్తులు కరోనా బారిన పడకుండా ఏర్పాట్లు చేశారు. అలిపిరి వద్ద కరోనా పరీక్షలు, శ్రీవారి క్యూలైన్ల వద్ద ఓజోన్‌ స్ప్రే సిస్టమ్‌ , ఆలయ సిబ్బందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo