శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - Jun 27, 2020 , 08:11:45

శ్రీవారి హుండీ ఆదాయం రూ.72లక్షలు

శ్రీవారి హుండీ ఆదాయం రూ.72లక్షలు

తిరుమల: లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం తెరుచుకున్న టీటీడీ ఆలయానికి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నిబంధనలు పాటిస్తూ భక్తుల సంఖ్యను ఆలయ అధికారులు పెంచుతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా టోకెన్లు పొందిన వారితో పాటు శుక్రవారం నుంచి సర్వదర్శనం కింద మరో 3750 మందికి టోకెన్లు అందజేశారు. 

దీంతో భక్తుల తాకిడి పెరిగింది.  శుక్రవారం  10,301 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 3,174 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.  గడిచిన 24 గంటల్లో భక్తులు హుండీలో వేసిన కానుకల ద్వారా ఆలయానికి రూ. 72 లక్షలు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.    


logo