బుధవారం 05 ఆగస్టు 2020
Devotional - Jul 02, 2020 , 08:51:47

శ్రీవారి హుండీ ఆదాయం రూ.67 లక్షలు

శ్రీవారి హుండీ ఆదాయం రూ.67 లక్షలు

తిరుమల: తిరుమల, తిరుపతి దేవస్థానంలో భక్తుల దర్శనం కొనసాగుతుంది . బుధవారం ఒక్కరోజే   స్వామివారిని 12,273 మంది భక్తులు దర్శించుకున్నారు. 3834 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ద్వారా టీటీడీకి రూ.67 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. కాగా ఆలయంలో శ్రీవారికి ఆర్జిత సేవలను రద్దు చేశారు. 

ప్రతిరోజు రాత్రి 9.30 స్వామి వారికి  అర్చకులు ఏకాంత సేవలను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 3వేల భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఉచిత సర్వదర్శనం కోసం తిరుపతిలోని నిర్దేశించిన కేంద్రాల్లో టోకెన్లు జారీ చేస్తున్నారు. 


logo