మంగళవారం 11 ఆగస్టు 2020
Devotional - Jun 28, 2020 , 17:30:15

జులై 3నుంచి శాకంబరి ఉత్సవాలు

జులై 3నుంచి శాకంబరి ఉత్సవాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై   వచ్చే నెల 3వ తేదీ నుంచి 5వ తేదీవరకు  శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం పాలక మండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు తెలిపారు. . కరోనా వైరస్‌ ఉధృతి పెరుగుతున్న సమయంలో శాకంబరి ఉత్సవాలను పరిమితంగా కూరగాయలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరిస్తామని పేర్కొన్నారు.

జులై 5న తెలంగాణ నుంచి జగన్మాత దుర్గమ్మకు బోనాలు తీసుకువస్తారని ఆయన వెల్లడించారు. మొదటి రెండు రోజులు అంతరాలయంలో సాధారణ అలంకరణ మాత్రమే చేస్తారని, చివరి రోజు ముఖమండపం నుంచి ధ్వజస్తంభం వరకు  కూరగాయలను అలంకరిస్తామని వివరించారు. సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాతనే కూరగాయల అలంకరణకు అనుమతిస్తామని అన్నారు. చివరి రోజు ఉదయం 11 గంటలకు నిర్వహించే పూర్ణాహుతీతో ఉత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు. 


logo