సోమవారం 10 ఆగస్టు 2020
Devotional - Jul 05, 2020 , 11:43:29

శాకాంబరిగా వరంగల్‌ భద్రకాళి అమ్మవారు

శాకాంబరిగా వరంగల్‌ భద్రకాళి అమ్మవారు

వరంగల్‌: నగరంలోని భద్రకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు ఈ రోజు శాకాంబరిగా దర్శనమిచ్చారు. 200 కిలోల కూరగాయలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. కరోనా నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. మాస్కు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని ధర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి తర్వాతే దర్శనానికి అనుమతిస్తున్నారు. 65 ఏండ్లు దాటిన వృద్ధులు, 10 ఏండ్లలోపు పిల్లలకు దర్శనానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. పదిహేను రోజులక్రితం ప్రారంభమైన ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.logo