ఆదివారం 09 ఆగస్టు 2020
Devotional - Jul 28, 2020 , 11:43:04

శ్రీవారి ఆలయంలో దోషాల నివారణకు పవిత్రోత్సవాలు

శ్రీవారి ఆలయంలో దోషాల నివారణకు పవిత్రోత్సవాలు

తిరుమల: ఈనెల 30 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏడాదికాలంగా జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికులు,  సిబ్బంది వల్లగాని తెలిసి, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటితో ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం  ప్రకారం పవత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు.

ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రెండు గంటల పాటు స్వామిఅమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారిని రంగనాయక మండపంలో వేంచేపు చేస్తారని వివరించారు. జూలై 30న పవిత్ర ప్రతిష్ట, 31న పవిత్ర సమర్పణ, ఆగస్టు 1న పూర్ణాహుతిని కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo