మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Devotional - Sep 09, 2020 , 21:33:25

ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ

ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ

తిరుమల : తిరుమ‌ల శ్రీ‌వారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అద‌న‌పు కోటాను టీటీడీ బుధవారం సాయంత్రం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. సెప్టెంబ‌రు 10 నుంచి 30వ తేదీ వ‌ర‌కు అద‌నంగా రోజుకు మూడువేల చొప్పున టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. క‌రోనా వైరస్‌ వ్యాప్తి నివార‌ణ చర్యల్లో భాగంగా ఆఫ్‌లైన్‌లో ఇస్తున్న సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లను ఈ నెల 30వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భ‌క్తుల కోరిక మేర‌కు అద‌నంగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు టీటీడీ వివరించింది.logo