శనివారం 29 ఫిబ్రవరి 2020
రథసప్తమి.. అరసవల్లికి పోటెత్తిన భక్తులు

రథసప్తమి.. అరసవల్లికి పోటెత్తిన భక్తులు

Feb 01, 2020 , 08:12:42
PRINT
రథసప్తమి.. అరసవల్లికి పోటెత్తిన భక్తులు

శ్రీకాకుళం: రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లికి భక్తులు పోటెత్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి నిజస్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలతో స్వామి వారికి మహాక్షీరాభిషేకం చేశారు. వీఐపీ, సర్వదర్శనం క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు ఇంద్ర పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి వారిని దర్శించుకునేందుకు సిద్దమయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పిల్లలతో వచ్చిన భక్తులకు ఉచితంగా పాలను అందజేస్తున్నారు.


logo