బుధవారం 05 ఆగస్టు 2020
Devotional - Jun 21, 2020 , 10:48:36

తిరుమలలో గ్రహణ శాంతి జపయజ్ఞం

తిరుమలలో గ్రహణ శాంతి జపయజ్ఞం

అమరావతి : సూర్య‌గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం గ్రహణ శాంతి జపయజ్ఞం నిర్వహించారు. టీటీడీ అర్చకులు, పండితులు పుష్కరిణీలో స్నానాలు ఆచరించి యజ్ఞంలో పాల్గొన్నారు.  కాగా శనివారం రాత్రి టీటీడీ ఈవో ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఆలయ అర్చకులు  ఆలయ  ప్రధాన ద్వారాన్ని మూసివేశారు.

అనంతరం ఆలయ ఈవో మాట్లాడుతూ.. ఆది‌వారం ఉదయం 10.18 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల వరకు ఉండే సూర్యగ్రహణ సమయంలో ప్ర‌పంచ శాంతి, సృష్ఠిలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని కోరుతూ పుష్క‌రిణిలో జ‌ప‌య‌జ్ఞం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.

అనంతరం మ‌ధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు ఏకాంతంగా సుప్ర‌భాతం, శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి లోప‌ల పంచాంగ శ్ర‌వ‌ణం, రాత్రి కైంక‌ర్యాలు, ఏకాంతసేవ నిర్వ‌హిస్తార‌ని తెలిపారు.   ఆదివారం భక్తులకు దర్శనం ఉండదని పేర్కొన్నారు. సోమవారం ఉద‌యం నుంచి భ‌క్తులను శ్రీ‌వారి ద‌ర్శనానికి అనుమ‌తించ‌నున్న‌ట్లు తెలిపారు. 


logo