శనివారం 26 సెప్టెంబర్ 2020
Devotional - Sep 14, 2020 , 18:58:03

ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్ర సమర్పణ

ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్ర సమర్పణ

తిరుపతి : అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న ప్రవితోత్సవాల్లో భాగంగా సోమవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పత్ర్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, అర్చన జరిపారు. యాగశాల వేదిక కార్యక్రమాలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూల విరాట్‌కు, ఉత్సవమూర్తులకు, పద్మావతి అమ్మవారికి, ఆండాళ్‌ అమ్మవారికి, జయవిజయులకు, గరుడాళ్వార్‌, ఆంజనేయస్వామి వారికి, ధ్వజస్తంభానికి, పరివార దేవతలకు పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ పీ బసంత్‌కుమార్‌ మాట్లాడుతూ సంవత్సరం పొడవునా ఆలయంలో నిర్వహించిన పలు క్రతువుల్లో తెలియక జరిగే దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారన్నారు. ప్రతి ఏడాది మూడు సార్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఆదివారం పవిత్ర పతిష్ట, సోమవారం సమర్పణ నిర్వహించినట్లు తెలిపారు. మంగళవారం మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, ఏఈవో సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్‌ గోపాలకృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.


logo