ఆదివారం 09 ఆగస్టు 2020
Devotional - Jul 28, 2020 , 00:47:16

గోవింద మొబైల్ యాప్‌లోనూ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్లు

  గోవింద మొబైల్ యాప్‌లోనూ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్లు

తిరుప‌తి : తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో జూలై 31న వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రుగ‌నున్న‌ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఆన్‌లైన్ టికెట్ల‌ను టిటిడికి చెందిన గోవింద మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చే‌సుకునే అవ‌కాశాన్ని టిటిడి క‌ల్పి స్తున్నది. ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఈ టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. భ‌క్తుల కోరిక మేర‌కు వ‌ర్చువ‌ల్ సేవ‌గా ప్ర‌వేశ‌పెట్టిన వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్ల‌కు ఆన్‌లైన్‌లో భ‌క్తుల నుంచి విశేష స్పంద‌న ల‌భి స్తున్నది. చాలా మంది భ‌క్తులు టిటిడి వెబ్‌సైట్ ద్వారా ఈ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్ప‌టికే బుక్ చేసుకున్న ప‌లువురు భ‌క్తుల‌కు పోస్ట‌ల్ శాఖ ద్వారా పూజాసామగ్రిని బ‌ట్వాడా చేశారు.logo