మంగళవారం 26 మే 2020
Devotional - May 20, 2020 , 22:25:47

రాజన్న భక్తులకు ఆన్‌లైన్‌లో పూజలు

రాజన్న భక్తులకు ఆన్‌లైన్‌లో పూజలు

 వేములవాడ   : ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకోవడంతో భక్తుల కోసం రాజన్న ఆలయ అర్చకులు వారి గోత్రనామాలపేర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని అద్దాలమండపంలో అర్చకులు అభిషేకపూజలు, అన్నపూజలు, నాగిరెడ్డిమండపంలోని బాలాత్రిపురసుందరి అమ్మవారి వద్ద కుంకుమపూజలు, కళాభవన్‌లో స్వామివారి నిత్యకళ్యాణం, సత్యనారాయణవ్రతం, లింగార్చన కార్యక్రమాలు  నిర్వహించారు.

 మాసశివరాత్రి సందర్భంగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారికి ఉదయం ఆలయ అర్చకులు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. రాత్రి ఆలయ అద్దాలమండపంలో మహాలింగార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌, ప్రధానార్చకులు నమిలకొండ ఉమేశ్‌, దుమాల నాగరాజు, గోపన్నగారి గణేశ్‌, శివుడు, అప్పాల రాజాచంద్ర, తదితరులు పాల్గొన్నారు.logo