శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Devotional - Mar 24, 2020 , 17:06:41

ఇళ్లవద్దనే నమాజ్ చేయండి..మతపెద్దల విజ్ఞప్తి

ఇళ్లవద్దనే నమాజ్ చేయండి..మతపెద్దల విజ్ఞప్తి

హైదరాబాద్: ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభం కారణంగా మసీదులో నమాజ్ చేయడం నుంచి ముస్లింలకు మినహాయింపు లభించింది. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ముస్లింలు ఇంటి వద్దనే నమాజ్ చేసుకోవచ్చని మతపెద్దలు అనుమతి ఇచ్చారు. జామియా నిజామియా సంస్థకు చెందిన పెద్దలు 


మంగళవారం సమవేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తదనంతరం వారు తమ సందేశాన్ని చదివి వినిపించారు. కరోనా వేగంగా 


విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రార్థన నిమిత్తం మసీదులకు ఎవరూ రావద్దని, ఇళ్లవద్దనే నమాజ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


logo