మంగళవారం 04 ఆగస్టు 2020
Devotional - Jul 30, 2020 , 08:16:32

తిరుమలలో సాధారణ రద్దీ

తిరుమలలో సాధారణ రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. బుధవారం శ్రీవారిని 6,278 మంది భక్తులు దర్శించుకోగా 2,248 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా ఆలయానికి రూ.52లక్షల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆలయంలో దోషాలు తొలగిపోవాలని ప్రార్థిస్తూ గురువారం నుంచి మూడు రోజుల పాటు ఆలయంలో పవిత్రోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.  దీనిలో భాగంగా తొలిరోజు పవిత్ర ప్రతిష్ట, స్నపన తిరుమంజనం, తిరుమల నాదనీరాజనం వేదికపై విరాటపర్వం పారాయణాన్ని జరుపుతున్నారు. 

శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొలిసారిగా వర్చువల్‌ విధానంలో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తున్నారు. ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులకు వరలక్ష్మీ వ్రతాన్ని ప్రసారం చేయనున్నారు. వర్చువల్‌ విధానంలో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులు అర్చక స్వాములు సూచనల మేరకు గోత్రనామాలతో సంకల్పం చెప్పాల్సి ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo