బుధవారం 03 జూన్ 2020
Devotional - Apr 29, 2020 , 22:34:35

మే 3 త‌ర్వాతే తిరుమ‌ల ద‌ర్శ‌నాల‌పై తుది నిర్ణ‌యం:టీటీడీ

 మే 3 త‌ర్వాతే తిరుమ‌ల ద‌ర్శ‌నాల‌పై తుది నిర్ణ‌యం:టీటీడీ

తిరుప‌తి:  తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శనంపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశారు టీటీడీ ఈవో. మే 3వ తేదీ తరువాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారం శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం వెనువెంటనే భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించే పరిస్థితి లేదన్నారు. మే 1వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగాల్సిన పద్మావతి పరిణయోత్సవాలను వాయిదా వేసినట్లు ఈవో తెలిపారు. అటు స్వామి వారికి జ‌ర‌గాల్సిన నిత్య‌కైంక‌ర్యాలు జ‌రిపిస్తున్నామ‌ని చెప్పారు. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించారు.


logo