శుక్రవారం 30 అక్టోబర్ 2020
Devotional - Oct 17, 2020 , 15:26:58

తెరుచుకున్న మధురలోని కృష్ణాలయం

తెరుచుకున్న మధురలోని కృష్ణాలయం

లక్నో : లాక్‌డౌన్‌ అనంతరం తొలిసారిగా శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని బాంకే బిహారీ ఆలయంలో తెరుచుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఏడు నెలల పాటు మూసే ఉన్న ప్రఖ్యాత ఆలయం కోర్టు ఉత్తర్వుల అనంతరం తెరిచారు. అంతకు ముందు పరిపాలన విభాగం పోలీసులతో సమావేశం నిర్వహించింది. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9.30గంటల వరకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. కరోనా సంక్రమణ క్రమంలో కఠిన నిబంధనలను పాటించాలని, ప్రసాదం, పువ్వులు ఆలయంలోకి అనుమతి ఇవ్వడం లేదని మధుర పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఉదయ్‌ శంకర్‌ చెప్పారు. సామాజిక దూరం, శానిటైజేషన్‌, మాస్క్‌లు ధరించడం తప్పనిసరని ఆలయ పరిపాలన విభాగం పేర్కొంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా, సామాజిక దూరం పాటించేలా వలంటీర్లను నియమించనున్నట్లు తెలిపింది. అలాగే భక్తులను నియంత్రించేందుకు అదనంగా పోలీస్‌ బలగాలు అవసరం ఉంటుందని, భక్తులందరు కొవిడ్‌ నియమాలను పాటిస్తారనే నమ్మకం ఉందని టెంపుల్‌ అడ్మినిస్ట్రేటర్‌ మునిష్‌ పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.