శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - Jun 27, 2020 , 07:47:25

శ్రీవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్‌ సీఎం

శ్రీవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్‌ సీఎం

తిరుమల: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ కుటుంబ సమేతంగా  శనివారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు లాంఛనంగా స్వాగతం పలికి  ప్రత్యేక దర్శనం ద్వారా ఆలయానికి తీసుకెళ్లారు.   శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో సీఎం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. 

 ఈ సందర్భంగా  ఆలయ అధికారులు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ను శాలువాతో సత్కరించారు.  విజయవాడ  పార్లమెంట్‌  సభ్యుడు కేశినేని నాని స్వామివారిని దర్శించుకున్నారు. 


logo