గురువారం 04 జూన్ 2020
Devotional - May 06, 2020 , 10:10:48

ఘనంగా లక్ష్మీనారసింహుని జయంతి ఉత్సవాలు

ఘనంగా లక్ష్మీనారసింహుని జయంతి ఉత్సవాలు

హైదరాబాద్‌: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి కలశ అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్త బీ నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి గీత, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మూడు రోజులుగా స్వామివారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు జరగనున్న పూర్ణాహుతి, సహస్ర ఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. పాతగుట్టలోని ఆలయంలోనూ స్వామివారి జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.


logo