శనివారం 31 అక్టోబర్ 2020
Devotional - Oct 07, 2020 , 09:19:29

రాజన్న ఆలయంలో కోడె మొక్కులు షురూ..

రాజన్న ఆలయంలో కోడె మొక్కులు షురూ..

వేములవాడ కల్చరల్‌ : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కోడెమొక్కులు ప్రారంభమయ్యాయి. స్వామివారికి ప్రీతికరమైన మొక్కును చెల్లించేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంతో పలువురు భక్తులు బుధవారం కొడెను కట్టేశారు. అలాగే పలు ఆర్జిత సేవలు కూడా నేటి నుంచి కొనసాగనున్నాయి. కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ నుంచి భక్తులకు అనుమతి ఇవ్వడం లేదు. అన్‌లాక్‌లో భాగంగా కేంద్రం ఇచ్చిన సడలింపులతో భక్తులకు ప్రస్తుతం దర్శనం మాత్రమే కల్పిస్తుండగా.. ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ నెల 5న అధికారులు బుధవారం నుంచి పలు సేవల్లో భక్తులకు పాల్గొనేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. రాజన్నకు ప్రీతికరమైన కోడె మొక్కుతో పాటు సత్యనారాయణ వ్రతాల మొక్కలు చెల్లించుకునేందుకు అవకాశం ఇచ్చారు. రాజన్న అభిషేకాలు, అన్నపూజ, కుంకుమపూజలకు అనుమతి నిరాకరించారు. అనుంబంధ భీమేశ్వరస్వామి, బద్దిపోచమ్మ ఆలయంలో అభిషేకాలు, బోనాల మొక్కులు చెల్లించేందుకు సమ్మతించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.