గురువారం 28 జనవరి 2021
Devotional - Nov 30, 2020 , 13:01:33

శైవ క్షేత్రాలకు పోటెత్తుతున్నభక్తులు...

శైవ క్షేత్రాలకు పోటెత్తుతున్నభక్తులు...

హైదరాబాద్ :రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతు న్నారు. తెలంగాంణ లోని కీసరగుట్ట ఆలయం ,వరంగల్ వెయ్యి స్తంభాల గుడి,వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం, కాళేశ్వర,ముక్తేశ్వర ఆలయం,  సొమేశ్వరస్వామి దేవాలయం,శ్రీ రుద్రేశ్వర స్వామి వారి దేవాలయం, ఓదెల మల్లికార్జున దేవస్థానం, ఐనవోలు మల్లికార్జున స్వామీ ఆలయం,ఆంద్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం కోసం భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఒక్క శ్రీకాళహస్తీలోనే కాదు.. శైవ క్షేత్రాన్నింటికి భక్తులు పోటెత్తుతున్నారు.

పుణ్యస్నానాలు ఆచరించి ముక్కంటీశుణ్ణి దర్శించుకుంటున్నారు. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి దేవదేవుడిని ఆరాధిస్తున్నారు.దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భ్రమరాంబ దేవి, మల్లికార్జున స్వామిల దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలతో తరలి రావడంతో శ్రీశైల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నది. తెల్లవారుజాము నుండే పాతాల గంగ వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పాతలగంగలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. దీంతో పాతాళ గంగ ప్రాంతం అంతా దీపకాంతుల తో కళ కళ లాడింది. కరోనా నేపథ్యంలో ఆలయాల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు భక్తులు సామాజిక దూరం పాటించేలా సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo