ఆదివారం 05 జూలై 2020
Devotional - Jun 30, 2020 , 21:20:54

రేపటి నుంచి పవిత్రోత్సవాలు

 రేపటి నుంచి పవిత్రోత్సవాలు

తిరుపతి: తిరుపతి పట్టణం శ్రీ కపిలేశ్వర స్వామి  ఆలయంలో  బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు  ఆలయ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 నిమిషాల వరకు అంకురార్పణ చేస్తామన్నారు.

చివరి రోజు ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మహా పూర్ణాహుతి, యాగశాల పూజ, హోమం, కలశ ఉద్వాసన, అభిషేకం, పవిత్ర సమర్పణ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పంచమూర్తులైన వినాయక స్వామి, సుబ్రహ్మణ్యస్వామి, కామాక్షి అమ్మవారు, కపిలేశ్వరస్వామి, చండికేశ్వర స్వామిని ఆలయంలో ఊరేగిస్తామని తెలిపారు. 


logo