మంగళవారం 02 మార్చి 2021
Devotional - Jan 22, 2021 , 09:20:52

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తులు రద్దీ గణనీయంగా పెరిగింది. కరోనా తగ్గుముఖం పడుతుండడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున జనం ఏడు కొండలకు తరలివస్తున్నారు. ఇటీవల కాలంలో 40వేల మంది భక్తులు వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న దాఖలాలు లేవు. అయితే గురువారం 41,442 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే హుండీ ఆదాయం రూ. 2.99కోట్లు వచ్చినట్లు పేర్కొంది. శ్రీవారిని దర్శించుకొని 18,161 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు వివరించింది. ఇదిలా ఉండగా.. బుధవారం సైతం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన, అద్దె గదుల టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 

VIDEOS

logo