మంగళవారం 11 ఆగస్టు 2020
Devotional - Jun 25, 2020 , 12:06:01

అదనంగా మరో 3వేల మందికి శ్రీవారి దర్శనభాగ్యం

అదనంగా మరో 3వేల మందికి శ్రీవారి దర్శనభాగ్యం

తిరుమల: తిరుమలలో అదనంగా మరో 3వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ  ఉత్తర్వులు జారీ  చేసింది. 

ఇందుకోసం ఈరోజు నుంచి 10వేల ఆన్‌లైన్‌ టోకెన్లతో పాటు అదనంగా మరో 3వేల టోకెన్లు జారీ చేసింది. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆలయాన్ని కరోనా వైరస్‌ కారణంగా దాదాపు  80 రోజుల పాటు మూసివేశారు. తిరిగి గత 10 రోజుల క్రితమే  ఆలయాన్ని తెరిచారు. అయితే కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ  ముందుగా 7వేల మంది ఆన్‌లైన్‌ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే టీటీడీ ఆలయ అధికారులు దర్శనభాగ్యం కల్పించారు.

అనంతరం మరో 3వేల మందికి పొడిగించి 10వేల టోకెన్లు జారీ చేశారు. తాజాగా గురువారం నుంచి 10వేలకు అదనంగా మరో 3వేల ఆన్‌లైన్‌ టోకెన్లు భక్తుల సౌకర్యార్ధం జారీ చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. 

 


logo