శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jul 18, 2020 , 21:06:19

వంద రోజులు పూర్తి చేసుకున్నపారాయణం ఆధ్యాత్మిక కార్యక్రమం

వంద రోజులు పూర్తి చేసుకున్నపారాయణం ఆధ్యాత్మిక కార్యక్రమం

తిరుమ‌ల: ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై టిటిడి నిర్వహిస్తున్న పారాయణం ఆధ్యాత్మిక కార్యక్రమం వంద రోజులు పూర్తి చేసుకున్నది.  శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్‌ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్న ఈ కార్య‌క్ర‌మాన్ని తెలుగు రాష్ట్రాల‌తోపాటు దేశ విదేశాల్లోని భ‌క్తులు పెద్ద‌సంఖ్య‌లో అనుస‌రించి త‌మ ఇండ్లలో పారాయ‌ణం చేస్తున్నారు.

విశ్వ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల నుంచి ఈ కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భి స్తున్నది. మొదటగా “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణాన్ని ఏప్రిల్ 10 నుంచి జూన్ 10వ తేదీ వ‌ర‌కు 62 రోజుల పాటు నిర్వహించారు. ఆ తరువాత జూన్ 11వ తేదీ నుంచి సుంద‌ర‌కాండ పారాయ‌ణం ప్రారంభమైంది. ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవ‌ధాని ఆధ్వ‌ర్యంలో ఉద‌యం 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌‌కు ఈ పారాయ‌ణం జ‌రుగుతున్నది.


logo