సోమవారం 13 జూలై 2020
Devotional - Feb 10, 2020 , 09:48:56

ఘనంగా సాగుతున్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా సాగుతున్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

మహబూబ్‌నగర్‌: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమయ్యాయి. రంగురంగుల పూలతో, నూతన వస్త్రాలతో  స్వామివారిని అలంకరించి, పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి రథోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని, పరవశించిపోయారు. రథోత్సవంలో తెలంగాణ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొని, మిగితా భక్తులతో సహా స్వామివారి పల్లకిని మోశారు. ఈ సందర్భంగా మంత్రిని పూజారులు ఆశీర్వదించారు. రథోత్సవం అనంతరం స్వామివారికి వేదపండితులు విశిష్ట పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలతో మన్యంకొండ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికంగా మారిపోయాయి.  స్వామివారి రథోత్సవం సందర్భంగా గుడి పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 


logo