సోమవారం 21 సెప్టెంబర్ 2020
Devotional - Aug 12, 2020 , 20:53:08

తిరుచానూరు శ్రీకృష్ణస్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు

తిరుచానూరు శ్రీకృష్ణస్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు

తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి వారి ఆలయంలో బుధవారం గోకులాష్టమి పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించారు. మధ్యాహ్నం స్నపన తిరుమంజనంలో భాగంగా పలు రకాల సుగంధద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ అనంతరం  గోపూజ‌, గోకులాష్ట‌మి ఆస్థానం నిర్వ‌హించారు. రేపు ఉట్లోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ ఏకాంతంగా నిర్వహిస్తారు.


logo